technology

శాంసంగ్ వినియోగ‌దారులకి ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌..!

మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌. శాంసంగ్ ఫోన్ మ‌రియు గెలాక్సీ వాచ్ వాడుతున్న యూజ‌ర్స్‌కి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికను జారీ చేసింది, శామ్‌సంగ్ వినియోగదారులు తమ పరికరాలను భద్రపరచుకునేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. సెర్ట్ ఇన్ ప్ర‌కారం శాంసంగ్ ప్రాసెస‌ర్‌లు మ‌న కోడ్‌ని అవ‌త‌లివారు యాక్సెస్ చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తుంది. ఇది “యూజ్-ఆఫ్టర్-ఫ్రీ” బగ్‌గా గుర్తించబడింది. ప్రమాదంలో ఉన్న పరికరాలలో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్. ఈ ప్రాసెసర్‌లు అనేక స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో ఉన్నాయి.

ఎగ్జినోస్ 9820, ఎగ్జినోస్ 9825, ఎగ్జినోస్ 980, ఎగ్జినోస్ 990, ఎగ్జినోస్ 850 వంటి ప్రాసెస‌ర్స్ ఉన్న ఫోన్స్‌లో భ‌ద్ర‌తాలోపం ఉంద‌ని గుర్తించారు. అంతేకాకుండా గెలాక్సీ వాచ్ డ‌బ్ల్యూ 920 ప్రాసెస‌ర్ కూడా ప్ర‌మాద‌క‌రం అని క‌నుగొన్నారు. శాంసంగ్‌కి చెందిన చాలా ఫోన్స్ ఈ ప్రాసెస‌ర్‌ల‌ని క‌లిగి ఉన్నాయి. భార‌తదేశంలో మిలియన్ల ఫోన్స్ చెలామణిలో ఉన్నందున, ఈ హెచ్చరిక చేయ‌డం జ‌రిగింది. అయితే మీరు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లేదా గెలాక్సీ వాచ్‌ని కలిగి ఉంటే, మీ ఫోన్ ప్రాబ్ల‌మ్‌లో ఉందో లేదో తెలుసుకోవ‌డానికి మీ ప్రాసెసర్‌ని ఇలా ధృవీక‌రించండి.

government issues alert to samsung users

మీ శాంసంగ్ ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లండి. ఫోన్ అనే ఆప్ష‌న్ నొక్కండి. ప్రాసెసర్ వివరాలను తనిఖీ చేయండి. ఇది సెర్ ఐన్ ద్వారా జాబితా చేయబడిన ఏదైనా మోడల్‌తో సరిపోలితే, మీ పరికరం ప్రమాదంలో పడవచ్చు. సెట్టింగ్‌లకు వెళ్లండి. సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌పై నొక్కండి. కొత్త అప్డేట్ వ‌స్తే దానిని అప్‌డేట్ చేసుకొని ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఇక్క‌డ మీరు గ‌మ‌నించాల్సిన అంశం ఏంటే మీ ఫోన్ సాఫ్ట్ వేర్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ టూ డేట్‌లో ఉండాలి. ఎందుకంటే ఈ అప్‌డేట్‌లు తరచుగా ఇటువంటి భద్రతా లోపాల కోసం పరిష్కారాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని శాంసంగ్ వినియోగదారులు సెర్ట్ ఇన్‌ మార్గదర్శకాలను అనుసరించాలి మరియు వారి పరికరాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఆలస్యం లేకుండా ఈ రూల్స్ ఫాలో కావాలి.

Sam

Recent Posts