Himaja : ఈ మధ్య కాలంలో చాలా మంది గ్రామల వైపు వెళ్తూ కల్లు సేవిస్తున్నారు. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు అందరూ కల్లు ప్రియులుగా మారిపోతున్నారు. కల్లును సేవించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అందువల్లే కల్లును చాలా మంది తాగుతున్నారు. పైగా గ్రామీణ వాతావరణంలో పచ్చని ప్రకృతిలో కల్లును సేవిస్తే.. వచ్చే మజాయే వేరు. కనుక కల్లుకు ఆదరణ పెరుగుతోంది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ హిమజ కూడా కల్లును టేస్ట్ చేసింది.
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన నటి హిమజ తాజాగా ఓ చోట కల్లు తాగింది. ఆ సమయంలో తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇటీవల పాపులర్ అయిన అరబిక్ కుత్తు అనే సాంగ్‌ను జత చేసింది. దీంతో ఆమె పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
కల్లు ఎలా ఉంది ? అని చాలా మంది ఆమెను అడుగుతున్నారు. ఈ క్రమంలోనే హిమజ తాటి రేకులో కల్లు తాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈమె ప్రస్తుతం అనేక షోలతోపాటు సినిమాల్లోనూ నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.