Cot : మంచంపై ఈ వ‌స్తువుల‌ను ఉంచుతున్నారా ? అయితే అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంది..!

Cot : మనం విశ్రాంతి తీసుకోవ‌డానికి, నిద్రించ‌డానికి మంచాన్ని ఉప‌యోగిస్తాము. కానీ మంచంపై కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ ఉంచుతూ ఉంటాం. ఇలా తెలిసో తెలియ‌కో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌హా పాపం చుట్టుకుంటుంది. మంచంపై వీటిని ఉంచ‌డం వ‌ల్ల మ‌నం క‌ష్టాల‌ను, ద‌రిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మంచంపై ఉంచ‌కూడ‌ని వ‌స్తువులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మంచాన్ని ప‌డుకోవ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగించాలి. మ‌నం ఏ దిక్కునుండి అయితే మంచం ఎక్కుతామో అదే దిక్కు నుండి మంచాన్ని దిగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు తొల‌గిపోయి మ‌నం ఆనందాన్ని పొంద‌గ‌లం. చాలా మంది ఇండ్ల‌లో మంచం ప‌క్క‌నే బీరువా ఉంటుంది. బీరువా నుండి తీసేట‌ప్పుడు మ‌ర‌లా లోప‌ల పెట్టెట‌ప్పుడు మ‌నం డ‌బ్బును కానీ, బంగారాన్ని కానీ, కొత్త బ‌ట్ట‌ల‌ను కానీ పెడుతూ ఉంటాం. అలా డ‌బ్బును కానీ, బంగారాన్ని కానీ పొర‌పాటున కూడా మంచం మీద పెట్ట‌కూడ‌దు. అలాగే గుడి నుండి వ‌చ్చిన త‌రువాత మంచం మీద కూర్చోకూడ‌దు. మంచం మీద కాళ్లు పెట్టే వైపు అస్స‌లు కూర్చోకూడదు.

if you are putting these things on cot then know this
Cot

అలాగే కొంత‌మంది దిండు కింద డ‌బ్బును ఉంచ‌డం వ‌ల్ల డ‌బ్బు బాగా వ‌స్తుంద‌ని న‌మ్ముతుంటారు. అలా అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని ఈ విధంగా చేస్తే ల‌క్ష్మీ దేవి ఇంట్లోకి రాద‌ని పండితులు చెబుతున్నారు. అదే విధంగా మ‌నం కొని తెచ్చిన కొత్త‌బ‌ట్ట‌ల‌ను కూడా మంచంపై ఉంచ‌రాదు. ఇలా ఉంచ‌డం వ‌ల్ల మ‌ర‌లా మనం కొత్త‌బ‌ట్ట‌లు కొనుకోవ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ట‌. అలాగే మంచం మీద బంగారాన్ని ఉంచ‌కూడ‌దు. ఇలా ఉంచ‌డం వ‌ల్ల మంచం మీద నెగెటివ్ ఎన‌ర్జీ కార‌ణంగా ల‌క్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. ఇవే కాకుండా మంచం మీద పువ్వుల‌ను , ప‌సుపు, కుంకుమ‌ను కూడా ఉంచ‌కూడ‌దు. బియ్యం చెర‌గ‌డానికి ఉప‌యోగించే చాట‌ను కూడా మంచం మీద ఉంచ‌కూడ‌దు. చాలా మంది మంచం మీద కూర్చొని భోజ‌నం చేస్తూ ఉంటారు. ఇలా భోజ‌నం చేస్తూ కూర గిన్నెలు, అన్నం గిన్నెలు, ఉప్పును కూడా మంచం మీద ఉంచుతారు. ఇలా అస్సలు చేయ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రం ప‌ట్టి క‌ష్టాల పాల‌వుతామ‌ని, కోటీశ్వ‌రులు కూడా బీద‌వారు అవుతార‌ని పండితులు చెబుతున్నారు.

D

Recent Posts