RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్పటిలాగే రాజమౌళి మళ్లీ ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్ల వద్ద ఎన్‌టీఆర్, చరణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక రివ్యూలు కూడా సినిమాకు పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ రికార్డుల వేటను కొనసాగిస్తోంది.

కాగా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ మూవీని పైరసీ చేసేశారు. పలు వెబ్‌సైట్లలో ఈ సినిమా ప్రత్యక్షమైంది. మూవీ రూల్జ్, తమిళ్ రాకర్స్ వంటి సైట్లలో ఈ సినిమాకు చెందిన పైరసీ కాపీని అప్‌లోడ్ చేశారు. దీంతో సినిమాకు భారీ షాక్ తగిలినట్లు అయింది. సాధారణంగా భారీ బడ్జెట్‌చిత్రాలు విడుదల అయినప్పుడు అంత సులభంగా పైరసీ కాపీలు రావు. కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు సైట్లలో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పైరసీని ఎంకరేజ్ చేయవద్దని.. సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నారు.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారని.. ఎన్నో వేల మంది కష్టం ఇందులో ఉందని.. కనుక సినిమాను పైరసీ చేయవద్దని.. పైరసీని ప్రోత్సహించవద్దని.. థియేటర్‌కు వెళ్లి సినిమాను వీక్షించాలని.. ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా తొలి రోజు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కోలాహలం సృష్టించారు. పలు చోట్ల కొమురం భీమ్, అల్లూరి గెటప్‌లలో ఫ్యాన్స్ థియేటర్లకు వచ్చి అందరినీ అలరించారు.