Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kalakand Payasam : పాత ప‌ద్ధ‌తిలో చేసే పాల‌కోవా పాయ‌సం.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

D by D
March 13, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kalakand Payasam : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌లాకంద్‌ కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ స్వీట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌లాకంద్‌తో చేసే ఈ పాయ‌సం క‌మ్మ‌గా, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ క‌లాకంద్‌ పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌లాకంద్‌ పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – అర క‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు – అర క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర‌ క‌ప్పులు, పాలు – అర క‌ప్పు, జీడిప‌ప్పు – 8, బాదం ప‌ప్పు – 5, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, క‌లాకంద్‌ బిళ్ల‌లు – 4, కండెన్స్డ్ మిల్క్ – 400 ఎమ్ ఎల్.

Kalakand Payasam recipe in telugu very tasty easy to make
Kalakand Payasam

క‌లాకంద్‌ పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పెస‌ర‌ప‌ప్పు, బియ్యం వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి గంట‌కు పైగా నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని ఒక కుక్క‌ర్ లో వేసి త‌గ‌న‌న్ని నీళ్లు పోయాలి. కుక్క‌ర్ మూత‌ను ఉంచి మెత్త‌గా ఉడికించుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో పాలు, జీడిప‌ప్పు, బాదం, గ‌స‌గ‌సాలు వేసి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి చిన్న మంట‌పై 4 నిమిషాల క‌లుపుతూ ఉడికించాలి.

త‌రువాత ఇందులో మూడు క‌లాకంద్‌ బిళ్ల‌ల‌ను న‌లిపి వేసుకుని క‌ల‌పాలి. త‌రువాత కండెన్స్డ్ మిల్క్ వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మ‌రో క‌లాకంద్‌ బిళ్ల‌ను న‌లిపి పైన చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌లాకంద్‌ పాయ‌సం త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క‌ల‌కంద‌తో పాయసం త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Kalakand Payasam
Previous Post

Addasaram : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Next Post

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!