Karam Bathani : మనకు స్వీట్ షాపుల్లో, సూపర్ మార్కెట్ లలో, షాపులల్లో లభించే చిరుతిళ్లల్లో కారం బఠాణీ కూడా ఒకటి. కారం బఠాణీ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ కారం బఠాణీలను అదే రుచితో, అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. చాలా మంది వీటిని క్రిస్పీగా ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేయడం వల్ల బయట లభించే విధంగా ఉండే కారం బఠాణీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో లభించే విధంగా కారం బఠాణీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం బఠాణీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు బఠాణీ – 400 గ్రా., వంటసోడా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కారం – అర టీ స్పూన్ లేదా తగినంత, చాట్ మసాలా – అర టీ స్పూన్.
కారం బఠాణీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బఠాణీలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి అందులోనే ఉప్పు, వంటసోడా వేసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బఠాణీలను మరోసారి కడిగి అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత ఈ బఠాణీలను స్టవ్ మీద ఉంచి 7 నుండి 8 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి వస్త్రం మీద వేసి పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న బఠాణీలను వేసి వేయించాలి. బఠాణీలు చక్కగావేగి రంగు మారిన తరువాత వీటిని నూనెలో నుండి తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించిన తరువాత ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం బఠాణీ తయారవుతుంది. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.