Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Gongura Chicken Curry : గోంగూర చికెన్ క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

D by D
October 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Gongura Chicken Curry : గోంగూర చికెన్.. చాలా మంది గోంగూర చికెన్ ను రుచి చూసే ఉంటారు. గోంగూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, బ‌గారా అన్నం, పులావ్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. గోంగూర చికెన్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ ఒకేర‌కం చికెన్ క‌ర్రీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అంద‌రికి న‌చ్చే విధంగా , రుచిగా, సుల‌భంగా ఈ గోంగూర చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అరకిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, యాల‌కులు – 4, జీల‌కర్ర – ఒక టీస్పూన్, బిర్యానీ ఆకులు – 2, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గోంగూర ఆకులు -2 క‌ప్పులు, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Gongura Chicken Curry recipe very tasty with rice
Gongura Chicken Curry

గోంగూర చికెన్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత చికెన్ ను వేసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత మ‌రో క‌ళాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత గోంగూర ఆకులు వేసి క‌ల‌పాలి. గోంగూర పూర్తిగా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని ఉడుకుతున్న చికెన్ లో వేసి క‌ల‌పాలి.

అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా, మ‌రో టీ స్పూన్ ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంతో, చ‌పాతీ వంటి వాటితో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది.

Tags: Gongura Chicken Curry
Previous Post

Karam Bathani : కరకరలాడే కారం బఠాణి.. ఇలా చేసుకుని నెల రోజులు తినేయవ‌చ్చు..!

Next Post

Gold Jewellery Cleaning Tips : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ బంగారు ఆభ‌ర‌ణాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.