KGF 2 : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ మొదటి పార్ట్ సినిమా సంచలనం సృష్టించింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల సునామీని కొనసాగించింది. అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా అగ్ర హీరోల సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇందులో హీరో యష్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2ను ప్రకటించి కూడా చాలా నెలలు అయింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ థియేటర్లలోకి రావడం ఆలస్యం అవుతోంది.

అయితే ఎట్టకేలకు కేజీఎఫ్ 2 ఈ ఏడాదే విడుదల కానుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి గాను ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కొనుగోలు చేసింది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా.. అన్ని దక్షిణాది భాషలకు చెందిన హక్కులను జీ5 కొనుగోలు చేసింది. దీంతో కేజీఎఫ్ 2 సినిమా త్వరలో జీ5 లో ప్రసారం కానుంది.
అయితే ఏప్రిల్ 14 సినిమా విడుదలవుతుంది కనుక.. ఎలాంటి కండిషన్లు పెట్టకపోతే ఈ సినిమా మే 14 తరువాత ఓటీటీలోకి వస్తుంది. లేదా ఇంకా ఆలస్యం అవుతుంది. ఇక కేజీఎఫ్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ కలుగుతోంది. ఇక ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.