Kiara Advani : యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈమెకు సినిమాలు లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉంది. అయితే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ పక్కన నటించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాన తెరకెక్కించనున్న విజయ్ 12వ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుందని తెలుస్తోంది.

కియారా ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, రామ్ చరణ్ పక్కన వినయ విధేయ రామలో నటించి అలరించింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ 12వ సినిమాలోనూ ఈమె ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.
ఇక కియారాతో విజయ్ నటించనున్న సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే విజయ్ నటించనున్న తన 11వ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. విజయ్ దేవర కొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.