Kobbari Pudina Pachadi : కొబ్బ‌రి పుదీనా ప‌చ్చ‌డి ఇలా చేయండి.. వేడిగా అన్నంలో తింటే ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Kobbari Pudina Pachadi : మ‌నం ప‌చ్చికొబ్బ‌రితో చేసే వంట‌కాల్లో కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. కొబ్బ‌రి పచ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అన్నం, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ చేసే ఈ కొబ్బ‌రి ప‌చ్చ‌డిని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనా వేసి చేసే ఈ కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ విధంగా త‌యారు చేసే ప‌చ్చ‌డిని కూడా అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు. మ‌రింత రుచిగా పుదీనా వేసి కొబ్బ‌రి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి పుదీనా ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌గుళ్లు – అర టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, త‌రిగిన టమాట ముక్క‌లు – ఒక క‌ప్పు, పుదీనా ఆకులు – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 3.

Kobbari Pudina Pachadi recipe in telugu very tasty with rice
Kobbari Pudina Pachadi

కొబ్బ‌రి పుదీనా ప‌చ్చ‌డి తయారీ విధానం..

ముందుగా క‌ళాయిలో శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. చివ‌ర‌గా నువ్వులు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, పుదీనా ఆకులు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే వేయించిన ప‌దార్థాల‌న్నింటిని వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, చింత‌పండు, వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని తాళింపు వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి పుదీనా ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో, అల్పాహారాల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts