Tea : టీ ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది వారి రోజును టీ తోనే మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించడంలో, తలనొప్పిని తగ్గించడంలో, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందించడంలో టీ చక్కగా పని చేస్తుంది. రోజూ ఇంట్లో టీ ని తయారు చేసినప్పటికి చాలా మంది దీనిని చిక్కగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. టీ ని రుచిగా, చిక్కగా అందరికి నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, అల్లం – అర ఇంచు ముక్క, టీ పౌడర్ – రెండున్నర టీ స్పూన్, దంచిన యాలకులు – 3, పచ్చి పాలు – రెండు కప్పులు, పాల పొడి – ఒక టీ స్పూన్.
టీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు, అల్లం, యాలకులు వేసి వేడి చేయాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత టీ పొడి, పంచదార వేసి వేడి చేయాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత పచ్చి పాలు పోసి వేడి చేయాలి. టీ మరుగుతుండగానే ఒక గిన్నెలో పాల పొడి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని కూడా మరుగుతున్న టీ లో పోసి కలపాలి. ఈ టీని మరో మూడు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టీ తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల టీ చిక్కగా ఉండడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చిక్కటి టీ ని చాలా సులభంగా తయారు చేసుకుని తాగవచ్చు.