Masala Annam : మనం అన్నంతో వివిధ రకాల రైస్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ ఐటమ్స్ చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోగదిన రుచికరమైన రైస్ ఐటమ్స్ లో మసాలా అన్నం కూడా ఒకటి. మసాలా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన అన్నంతో లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ మసాలా అన్నాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, చాలా సులభంగా చేసుకోగలిగే ఈ మసాలా అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అన్నం – 2 కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా అన్నం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పల్లీలు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత అన్నం, ఉప్పు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా అన్నం తయారవుతుంది. ఈ మసాలా అన్నాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.