Money : ప్రస్తుత తరుణంలో కష్టపడి డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదిస్తేనే డబ్బు విలువ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ కొందరు మాత్రం ఆ విలువను గుర్తించలేరు. వచ్చిన రూపాయిని వచ్చినట్లే ఖర్చు చేస్తుంటారు. దీంతో అలాంటి వారు డబ్బులకు ఎల్లప్పుడూ ఇబ్బందులు పడుతుంటారు. అప్పుల మీద అప్పులు తీసుకుని జీవితాన్ని వెళ్లదీస్తారు. చివరకు అంతా అయిపోయిందని చేతులెత్తేస్తారు. చాలా మంది జీవితాలు ఇలాగే గడుస్తున్నాయి. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం అయితే కొంత మంది దగ్గర అసలు డబ్బే నిలవదట. వచ్చింది వచ్చినట్లు ఖర్చయినా అవుతుంది. నష్టమైనా జరుగుతుంది. ఇక అలాంటి వారు ఎవరంటే..
1. చాణక్యుడు చెప్పిన సూత్రాల ప్రకారం పగటిపూట నిద్రపోయే వారికి జీవితాంతం డబ్బులకు లోటు ఉంటుందట. వారి దగ్గర అసలు డబ్బు నిలవదట. అలాంటి వారి చేతిలో డబ్బు బాగా ఖర్చవుతుందట.
2. ఎల్లప్పుడూ చెడు మాటలు మాట్లాడుతూ చెడు పనులు చేసేవారి దగ్గర కూడా డబ్బు నిలవదట. వృథాగా ఖర్చవుతుందట.
3. అవసరం అయినదాని కన్నా అతిగా డబ్బు సంపాదించేవారు, ఆకలి అయిన దాని కన్నా ఎక్కువగా.. ఆబగా తినేవారి దగ్గర కూడా డబ్బు ఉండదట. వచ్చింది వచ్చినట్లే ఖర్చు చేస్తారట.
4. దంతాలు శుభ్రంగా లేని వారి దగ్గర కూడా డబ్బు ఉండదట. ఇక అక్రమంగా సంపాదించేవారు అప్పటికప్పుడు ధనవంతులు అయినా తరువాత వారి డబ్బు మొత్తం పోతుందట. అలాంటి వారి దగ్గర కూడా డబ్బు నిలవదట.
5. అతిథులకు మర్యాద ఇవ్వనివారు, విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసేవారి దగ్గర కూడా డబ్బు అసలు నిలవదని.. ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాల్లో చెప్పాడు.