OTT : వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రసారం అవుతుంటాయి. ఎక్కువగా శుక్రవారాల్లో వీటిని స్ట్రీమ్ చేస్తుంటారు. ఇక ఇంకో వారం మారింది. కనుక ఈ వారం ఓటీటీల్లో రానున్న పలు ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మార్చి 4వ తేదీన డీజే టిల్లు మూవీ స్ట్రీమ్ కానుంది. రొమాన్స్, కామెడీ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సాధించింది. ఈ మూవీ ఓటీటీలో ప్రసారం కానుంది.
మార్చి 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే లలో డానియెల్ క్రెయిగ్ నటించిన బాండ్ మూవీ నో టైమ్ టు డై స్ట్రీమ్ కానుంది. యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్, మిస్టరీ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
మార్చి 4వ తేదీ నుంచి ఆహా ప్లాట్‌ఫామ్‌లో రమణి వర్సెస్ రమణి 3.0 అనే కామెడీ డ్రామా టీవీ షో స్ట్రీమ్ కానుంది. అదే తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే టీవీ షో స్ట్రీమ్ కానుంది. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో ఈ షోను తెరకెక్కించారు. ఇందులో అజయ్ దేవ్‌గన్, రాశిఖన్నాలు కీలకపాత్రల్లో నటించారు.
మార్చి 4వ తేదీ నుంచి జీ5 యాప్‌లో సుత్లియాన్ అనే టీవీ షో ప్రసారం కానుంది. అలాగే అదే తేదీ నుంచి సోనీ లివ్‌లో ఉన్‌దేఖీ సీజన్ 2 స్ట్రీమ్ కానుంది. క్రైమ్, డ్రామా జోనర్‌లలో ఈ సిరీస్ ను తెరకెక్కించారు.