OTT : ప్రతి వారం ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రేక్షకులు కూడా వారం వారం ఏయే సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయా ? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న మూవీలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెల 9వ తేదీన హంగామా యాప్‌లో స్వాంగ్ అనే హిందీ సిరీస్ ప్రసారం కానుంది. థ్రిల్లర్, డ్రామాగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మార్చి 10వ తేదీన ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌లో అనామిక అనే హిందీ సిరీస్ ప్రసారం కానుంది. ఇది యాక్షన్, డ్రామా జోనర్‌లో తెరకెక్కింది.
మార్చి 11వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రవితేజ నటించిన ఖిలాడి సినిమా స్ట్రీమ్ కానుంది. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. మార్చి 11వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లోనే తమిళ నటుడు ధనుష్ నటించిన మారన్ అనే మూవీ స్ట్రీమ్ కానుంది. ఇది ఓటీటీలోనే నేరుగా రిలీజ్ అవుతోంది.
మార్చి 11వ తేదీన జీ5 యాప్‌లో మిస్టర్ అండ్ మిసెస్ షమీమ్ అనే హిందీ కామెడీ షో ప్రసారం అవుతుంది. మార్చి 11న ఆహాలో కుబూల్ హై అనే తెలుగు టీవీ షో ప్రసారం అవుతుంది. డ్రామా, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో ఈ షోను తెరకెక్కించారు.
మార్చి 11న జీ5 యాప్‌లో రైడర్ అనే కన్నడ/తెలుగు సినిమా స్ట్రీమ్ కానుంది. యాక్షన్, రొమాన్స్ కథాంశంతో సినిమా రూపొందింది. మార్చి 11వ తేదీనే జీ5 యాప్‌లో రౌడీ బాయ్స్ అనే తెలుగు సినిమా స్ట్రీమ్ కానుంది. అదే రోజు జీ5 యాప్‌లోనే సూపర్ శరణ్య అనే మళయాళం సినిమా స్ట్రీమ్ కానుంది.