Ram Charan Teja : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన RRR మూవీ త్వరలో విడుదల కానున్న విషయం విదితమే. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మరోసారి చేపట్టింది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. ఆదివారం వీరు వెకేషన్‌కు ప్రయాణం అయ్యారు.

రామ్ చరణ్ చాలా ఏళ్ల గ్యాప్ అనంతరం 2 ఏళ్ల తరువాత మళ్లీ ఇలా వెకేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఉపాసన ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు. తాము ఓ ప్రైవేట్ జెట్‌లో వెకేషన్‌కు వెళ్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. 2 ఏళ్ల తరువాత ఎట్టకేలకు వెకేషన్ మోడ్‌లోకి వచ్చాం.. అని ఆమె కామెంట్ చేశారు. అయితే ఏ ప్రదేశానికి వెకేషన్ వెళ్తుంది చెప్పలేదు.
కాగా ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ తన బర్త్‌డేను జరుపుకోనున్నారు. అయితే మార్చి 25న RRR సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో ఆయన ఫుల్ బిజీగా మారిపోతారు. అందుకనే కాస్త విరామం కోసం వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. అందులో రామ్ చరణ్ పార్ట్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.