OTT : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఏపీలో అంత టాక్ సాధించలేకపోయినా.. తెలంగాణలో మాత్రం ఈ మూవీ మంచి టాక్‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా శుక్రవారం (మార్చి 4, 2022) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ సంస్థ ఆహా డీజే టిల్లు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను శుక్రవారం నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అమెరికాలో మొదటి రోజు 2 లక్షల డాలర్ల మార్క్‌ను అందుకుంది.
ఇక శుక్రవారం ఇంకో ముఖ్యమైన సినిమా కూడా స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో నో టైమ్ టు డై అనే బాండ్ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇందులో డానియెల్ క్రెయిగ్ నటించారు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా ఇది. కాగా బాండ్‌గా డానియెల్ క్రెయిగ్‌కు ఇది చివరి సినిమా.
ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, హీరోయిన్లు రాశిఖన్నా, ఈషా డియోల్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే సిరీస్ కూడా శుక్రవారం నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్‌ను థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.