Mughlai Chicken Dum Biryani : మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేస్తే హోట‌ల్స్‌లో లాంటి రుచి వ‌స్తుంది..

Mughlai Chicken Dum Biryani : చికెన్ తో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగాఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీలో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – పావు క‌ప్పు, నీళ్లు – 1/3 క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్, త‌రిగిన పుదీనా – ఒక టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – 2 టీ స్పూన్స్, నూనె – పావు క‌ప్పు, కుంకుమ పువ్వు నీళ్లు – కొద్దిగా.

Mughlai Chicken Dum Biryani recipe in telugu this is the way to make it
Mughlai Chicken Dum Biryani

చికెన్ మ్యారినేష‌న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, జీడిప‌ప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, పిస్తా ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, బాదం ప‌ప్పు ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌మ్మ‌టి పెరుగు – అర క‌ప్పు, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, సాజీరా – ఒక టీ స్పూన్, మ‌రాఠి మొగ్గ – 1, బిర్యానీ ఆకు – 1, నూనె – పావు క‌ప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – పావు క‌ప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒకటిన్న‌ర క‌ప్పు, నీళ్లు – 2 లీట‌ర్లు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 4, ల‌వంగాలు – 4, మ‌రాఠి మొగ్గ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – 2, జాప‌త్రి – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా అడుగు మందంగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దానిలో చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి చికెన్ ముక్క‌ల‌కు ప‌ట్టేలా ప‌ది నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన తరువాత నానబెట్టిన బాస్మ‌తీ బియ్యాన్ని వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని 60 శాతం ఉడికే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికిన త‌రువాత అన్నాన్ని వ‌డ‌క‌ట్టుకుంటూ ముందుగా త‌యారు చేసుకున్న చికెన్ పై వేసుకోవాలి. ఇలా అన్నం అంతా వేసుకున్న త‌రువాత పైన స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత గిన్నె అంచుల వెంబ‌డి నెయ్యి, నీళ్లు, నూనె వేసుకోవాలి.

త‌రువాత ఫ్రైడ్ ఆనియ‌న్స్, కొత్తిమీర‌, పుదీనా చ‌ల్లుకోవాలి. ఇప్పుడు గిన్నె అంచుల వెంబ‌డి మైదా పిండిని ఉంచి ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా దానిపై మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ను 8 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై, 7 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆప్ చేయాలి. త‌రువాత 20 నిమిషాల పాటు మూత తీయ‌కుండా అలాగే ఉంచాలి. త‌రువాత మూత తీసి కుంకుమ పువ్వు నీళ్ల‌ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మొఘ‌లాయ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. వీకెండ్స్ లో లేదా ప్ర‌త్యేక రోజుల్లో బ‌య‌ట తినే ప‌నిలేకుండా ఇలా మొఘ‌లాయ్ ద‌మ్ బిర్యానీని ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts