Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ నిల్వ పచ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే సాంబార్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌నే లేదు. అలాగే ఈ మున‌క్క‌యాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం తెలియ‌క బ‌య‌ట కొనుగోలు చేస్తూ ఉంటారు.

కానీ మున‌క్కాయ ప‌చ్చ‌డిని ఇంట్లోనే అది కూడా చిటికెలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఈప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మున‌క్కాయ‌లు ఉంటే చాలు ఈ ప‌చ్చ‌డిని 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. చూస్తుంటేనే తినాల‌నిపించే మున‌క్కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Munakkaya Nilva Pachadi recipe in telugu make in this method
Munakkaya Nilva Pachadi

మునక్కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మున‌క్కాయ‌లు – 2, నాన‌బెట్టిన చింత‌పండు – 50 గ్రా., ఆవాలు -ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఎండుమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్.

మునక్కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా మునక్కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని రెండు ఇంచు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఆవాలు, మెంతులు వేసి దోర‌గా వేయించాలి. వీటిని పొడిగా చేసుకుని ప‌క్కకు ఉంచాలి. అలాగే చింత‌పండు నుండి చిక్క‌టి చింత‌పండు గుజ్జును తీసి పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువ‌త మున‌క్కాయ ముక్క‌ల‌ను వేసి 5 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో మిన‌పప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఇంగువ వేసి క‌ల‌పాలి.

తాళింపు వేగిన త‌రువాత చింత‌పండు గుజ్జు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, మిక్సీ ప‌ట్టుకున్న ఆవ‌పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత మున‌క్కాయ ముక్క‌లు, తాళింపు వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత గాజు సీసాలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచాలి. మున‌క్కాయ ముక్క‌లు బాగా ఊరి నూనె పైకి తేలిన త‌రువాత అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా లొట్ట‌లేసుకుంటూ తింటారు.

Share
D

Recent Posts