Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mutton Keema Curry : మ‌ట‌న్ కీమా క‌ర్రీ.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే.. రుచి అద్భుతం..!

D by D
June 4, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mutton Keema Curry : ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహారాలలో మ‌ట‌న్ కూడా ఒక‌టి. చాలా మంది మ‌ట‌న్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. మ‌ట‌న్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ట‌న్ ను ముక్క‌లుగా కాకుండా కీమా లాగా చేసి కూడా తింటుంటారు. మ‌ట‌న్ కీమాతో కూడా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మ‌ట‌న్ కీమా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ కీమా – పావు కిలో, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక గ్లాస్, చిన్న‌గా త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Keema Curry very easy to prepare it will be delicious
Mutton Keema Curry

మ‌ట‌న్ కీమా క‌ర్రీ తయారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనెను వేసి నూనె కాగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌లిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు శుభ్రంగా క‌డిగిన మ‌ట‌న్ కీమాను వేసి బాగా క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి క‌లిపి కీమాను పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కీమా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది.

Tags: Mutton Keema Curry
Previous Post

Spicy Jowar Roti : కారం జొన్న రొట్టెల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Next Post

Saggubiyyam Vadalu : స‌గ్గు బియ్యంతో వ‌డ‌లు కూడా చేయ‌వ‌చ్చు.. రుచి అద్బుతంగా ఉంటుంది..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!