వినోదం

Naga Chaitanya- Sobitha : అట్ట‌హాసంగా నాగ చైతన్య‌- శోభిత పెళ్లి వేడుక‌.. పెళ్లి దుస్తుల‌లో చూడ‌ముచ్చ‌ట‌గా నూత‌న దంప‌తులు

Naga Chaitanya- Sobitha : స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత ఏడాది పాటు సింగిల్‌గా ఉన్న చైతూ ఆ త‌ర్వాత శోభిత‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రెండేళ్ల‌పాటు వీరి ప్రేమాయ‌ణం సాగింది. ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 8న నాగ చైత‌న్య‌-శోభిత‌ల నిశ్చితార్థ వేడుక జ‌రిగింది.ఇక డిసెంబ‌ర్ 4న వీరి పెళ్లి తేది ఫిక్స్ చేయ‌గా గ‌త రాత్రి 8.13ని.ల‌కి చైతూ.. శోభిత మెడ‌లో మూడు ముళ్లు వేసారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ వివాహ వేడుకలు కొనసాగాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి, సుహాసిని, అడివి శేష్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, చాముండేశ్వరినాథ్ తదితరులు పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశారు.

నాగ చైతన్య శోభిత.. పెళ్లి వేడుక అంతా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లికి పంట్టు పంచలో నాగచైతన్య మెరిసిపోయాడు. కాంచివరం చీరలో శోభిత దేవతలా కనిపించింది. వారి వంశ పారంపర్యంగా వస్తున్న నగలను ధరించి కనిపించింది శోభిత. ముక్కు పుడక ప్రత్యేకంగా కనిపించగా చిరునవ్వు చిందిస్తూ.. పెళ్ళి వేడుకల్లో శోభిత లుక్ అంద‌రిని ఆక‌ర్షించింది. ఇక నాగార్జున కూడా సంప్రదాయ‌బ‌ద్ధంగా క‌నిపించారు. పెళ్లి ఫోటోల‌ని నాగార్జున అక్కినేని తన ఎక్స్ పేజ్ లో పెళ్ళి ఫోటోలను పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శోభిత విష‌యానికి వ‌స్తే ఆమె తల్లిది గుంటూరు జిల్లాలోని తెనాలి అయినప్పటికీ…‌ తండ్రి నేవి ఆఫీసర్ కావడంతో విశాఖలో ఉన్నారు. విశాఖలో ఆమె కుటుంబం స్థిరపడింది. తండ్రి వేణుగోపాల రావు మర్చంట్ నేవీ ఇంజనీర్. ఆవిడ తల్లి కామాక్షి స్కూల్ టీచర్. మోడ‌లింగ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత శోభిత సినిమాల‌లోకి వ‌చ్చింది. ఆమెది మొద‌టి వివాహం కాగా, నాగ చైత‌న్య‌ది రెండో వివాహం . స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ అనుకోని కార‌ణాల వ‌ల‌న 2021లో విడాకులు ఇచ్చారు. ఆ ఆర్వాత శోభిత‌తో ప్రేమ‌లో ప‌డి ఇప్పుడు ఆమెని వివాహం చేసుకున్నారు.

Sam

Recent Posts