Neer Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి హోట‌ల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..

Neer Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మ‌నం ఉద‌యం పూట చేసే ర‌క‌ర‌కాల చ‌ట్నీల్లో నీర్ చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా సుల‌భంగా, రుచిగా ఈ నీర్ చ‌ట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నీర్ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టీ స్పూన్, ప‌ల్లీలు – ఒక క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 6 లేదా త‌గిన‌న్ని, పుట్నాల ప‌ప్పు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు – ఒక రెమ్మ‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, అల్లం – అర ఇంచు ముక్క‌, పుదీనా ఆకులు – 4, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – ఒక‌ గ్లాస్.

Neer Chutney recipe in telugu very tasty easy to cook
Neer Chutney

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

నీర్ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పల్లీలు వేసి వేయించాలి. ఇవి స‌గం పైగా వేగిన త‌రువాత పుట్నాల ప‌ప్పు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అర గ్లాస్ నీళ్ల‌తో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ చ‌ట్నీని గిన్నెలోకి తీసుకుని మ‌రో అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న చ‌ట్నీలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నీర్ చ‌ట్నీ త‌యారవుతుంది. దీనిని ఉద‌యం త‌యారు చేసుకునే ఏ అల్పాహారంతోనైనా తిన‌వ‌చ్చు. ఈ చ‌ట్నీతో తిన‌డం వ‌ల్ల అల్పాహారాల రుచి మ‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు.

D

Recent Posts