Rashmika Mandanna Samantha : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈమె గతేడాది కాలంలో నటించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక సమంత కూడా టాప్ హీరోయినే. ఈమె హీరోయిన్‌గా నటించిన చిత్రాలు విడుదలై చాలా కాలం అవుతోంది. కానీ ఆమె అత్యధిక పారితోషికం అందుకుంటుంది కనుక టాప్ హీరోయినే అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో వీరిపై ప్రేక్షకులు భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు బలంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

తమిళ స్టార్ నటుడు విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డెలు నటిస్తున్న చిత్రం.. బీస్ట్. ఇందులోని అరబిక్ కుతు అనే వీడియో సాంగ్‌ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. ఈ పాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అనేక మంది ఈ పాటకు డ్యాన్సులు వేస్తున్నారు. అయితే సమంత ఎయిర్ పోర్టులో.. రష్మిక మందన్న బీచ్‌లో ఈ పాటకు డ్యాన్స్ లు చేశారు. అంత వరకు బాగానే ఉంది కానీ.. వీరు డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఎందుకంటారా..
తెలుగు ఇండస్ట్రీలో సమంత, రష్మిక మందన్నలకు వస్తున్న ఆఫర్లకు కొదువ లేదు. కానీ వీరు తెలుగు సినిమాల్లోని పాటలకు మాత్రం ఎన్నడూ ఇలా డ్యాన్స్‌లు చేయలేదు. ఒక తమిళ సినిమా పాటకు వీరు డ్యాన్స్‌లు చేస్తుండడం ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటిస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ.. ఇక్కడి సినిమాల పాటలకు డ్యాన్స్‌లు చేయరు.. కానీ తమిళ సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తారా.. తమిళం అంటే అంత పిచ్చి ఎందుకు ? తమిళ సినిమాలకు భజన ఎందుకు చేస్తున్నారు ? అంటూ.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు ఇలా చేసిన డ్యాన్స్‌లపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.
ఇక కీర్తి సురేష్‌ను కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈమెకు చాలా రోజుల నుంచి హిట్ చిత్రాలు లేవు. కానీ ఈమె కూడా తెలుగులోనే ఎక్కువగా నటించింది. ఈమె నటించిన మహానటి సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈమె తమిళపాటలకు అంత ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయడం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక్కడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఇక్కడ డబ్బు సంపాదిస్తూ తమిళ భజన ఎందుకని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు హీరోయిన్లపై ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి.
అయితే బీస్ట్ చిత్ర యూనిట్ ఇలా హీరోయిన్స్‌కు డబ్బులు ఇచ్చి తమ సినిమాను ప్రమోట్ చేయించుకుంటున్నారని.. అంతేకానీ.. ఈ సినిమా అన్నా.. అందులోని అరబిక్ కుతు పాట అన్నా.. వీరికి ఇష్టం లేదని.. వారు తమ సొంతంగా అలా ఎందుకు ఒక సినిమాను ప్రమోట్ చేస్తారని.. కొందరంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.