Upasana Kamineni : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ దంపతులు వెకేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఉపాసన తాము వెకేషన్‌కు వెళ్తున్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే ఉపాసనను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుందని వారు విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉపాసన సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ పోస్టులు పెడుతుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఆమె ఓ పోస్టు పెట్టింది. తాను మహా మృత్యుంజయ మంత్రం గురించి చదివానని.. ఏదైనా మెడిసిన్‌ను వాడేటప్పుడు ఈమంత్రం చదివితే రోగాలు నయమవుతాయని.. తాను చదివానని తెలియజేసింది. అయితే ఆమె ఇలా చెప్పిన ఈ విషయం చాలా పాతది. ఒక వీడియోలో ఆమె ఈ విధంగా మాట్లాడింది. కానీ దాన్ని ఇప్పుడు కొందరు వైరల్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో పేరుగాంచిన టాప్ మోస్ హాస్పిటల్‌కు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఉపాసన ఇలా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తుందేమిటని.. మందులను వాడితే వ్యాధులను తగ్గించుకోవచ్చని చెప్పాల్సింది పోయి.. మంత్రాలను చదవమని చెబుతుందేమిటి ? అంటూ.. కొందరు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినా.. ఆమె ఒక హాస్పిటల్‌కు పనిచేస్తున్నా.. ఇలా మంత్రాలను చదవమని చెబుతూ మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం బాగా లేదని అంటున్నారు.
అయితే కొందరు మాత్రం ఉపాసనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె కేవలం ఆ మంత్రం గురించి చదివానని చెప్పిందని.. అంతేకానీ.. దాన్ని అందరూ చదవండి.. అని ఆమె చెప్పలేదని.. అందులో అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.