Nidhhi Agerwal : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కొన్ని జంటలు పెళ్లి చేసుకుంటుండగా.. కొందరు మాత్రం విడిపోతున్నారు. ఇక కొందరు పెళ్లి కాకపోయినా.. రిలేషన్‌షిప్‌లో అయితే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి నిధి అగర్వాల్, తమిళ నటుడు శింబుల మధ్య కూడా ఇలాంటి రిలేషన్ షిప్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

నిధి అగర్వాల్, శింబులు ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఇద్దరూ కలసి ఈశ్వరన్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సమాచారం. అందులో భాగంగానే వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ తమ ఇరు కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న శింబు ఇంటికే మకాం మార్చినట్లు తెలుస్తోంది. అయితే వీరు గుట్టుగా పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకనే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.
కాగా ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్ పక్కన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ అవగానే ఈమె పెళ్లి పీటలు ఎక్కనుందని సమాచారం. దీనిపై వారే స్వయంగా ఏమైనా వివరాలను వెల్లడిస్తారో.. లేదో.. చూడాలి.