Pav Bhaji : ఎంతో రుచిక‌ర‌మైన పావ్ భాజీని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Pav Bhaji : మ‌న‌కు సాయంత్రం పూట చాట్ బండార్ ల‌ల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ కూడా ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇది మ‌న‌కు సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పావ్ భాజీని మ‌నం ఇంట్లో కూడా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా కూడా సుల‌భంగా చేయ‌గ‌ల‌రు. రుచిగా, సుల‌భంగా ఇంట్లో పావ్ భాజీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పావ్ భాజీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పావ్ భాజీ బ్రెడ్ – 4, ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉడికించిన బ‌ఠాణీ – అర క‌ప్పు, బ‌ట‌ర్ – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పావ్ భాజీ మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక పెద్ద గ్లాస్.

Pav Bhaji recipe in telugu make in this method
Pav Bhaji

పావ్ భాజీ బ్రెడ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌లు, బ‌ఠాణీ, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత ఉప్పు, కారం, పావ్ భాజీ మ‌సాలా, క‌సూరి మెంతి వేసి క‌లపాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి స్మాష‌ర్ తో ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి.

దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, మ‌రో టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడ‌య్యాక బ్రెడ్ ను మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పావ్ భాజీ త‌యార‌వుతుంది. దీనిని ఉల్లిపాయ ముక్క‌లతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే పావ్ భాజీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts