Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన చిత్రాలన్నీ హిట్ అవుతుండడంతో ఆమెకు పాపులారిటీ పెరిగింది. దీంతో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో పూజా హెగ్డె ప్రస్తుతం హీరో విజయ్ సరసన.. బీస్ట్.. అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ మూవీలోంచి అరబిక్ కుత్ అనే లిరికల్ వీడియోను తాజాగా లాంచ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. బీస్ట్. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి చెందిన అరబిక్ కుతు అనే లిరికల్ సాంగ్‌ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో పూజా హెగ్డె అదిరిపోయే రీతిలో స్టెప్పులు వేసింది. నడుమును ఒయ్యారంగా తిప్పుతూ పూజా చేసిన డ్యాన్స్‌కు మతులు పోతున్నాయి.
కాగా బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక పూజా హెగ్డె రాధే శ్యామ్ చిత్రంలో నటించగా.. ఆ మూవీలోంచి వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను ఆవిష్కరించారు. అందులో ఆమె ప్రభాస్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్.. అని అడిగే సీన్ హైలైట్‌గా నిలిచింది. పూజా గతంలో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా హిట్ అయింది. ఇందులో అఖిల్ కూడా చక్కగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.