Lord Ganesha : ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అన్ని చోట్లా గణనాథులు కొలువై భక్తులచే పూజలను అందుకుంటున్నారు. అయితే ఈ నవరాత్రుల సందర్భంగా భక్తులు గణేషున్ని అనేక విధాలుగా పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆకుతో నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజు వినాయకున్ని పూజిస్తే దెబ్బకు దరిద్రం మొత్తం పోతుంది. కోటీశ్వరులు అవుతారు. మరి ఆ ఆకు ఏదంటే..
గణేష్ నవరాత్రులలో గణపతిని పత్రాలతో పూజిస్తే కూడా అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. అంటే రకరకాలైనటువంటి చెట్ల ఆకులతో కానీ, ఇంకా ఇతర పత్రాలతో కానీ, గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. దవనం ఆకులను మనం పూల మధ్యలో కట్టి ఆ పూలమాలను భగవంతుడికి సమర్పిస్తాం. దవనం అనేది సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపమని అగ్ని పురాణాలలో చెప్పారు. ఈ దవనం అంటే శివుడికే కాదు గణపతికి కూడా చాలా ఇష్టం.
నవరాత్రులలో గణపతికి దవనం సమర్పించి నమస్కారం చేసుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే మీరు ఒక పని అనుకున్నప్పుడు ఆ పని 100 శాతం అవ్వాలి అంటే పూల మధ్యలో దవనం కట్టి ఆ పూలమాలను గణపతికి సమర్పించండి. లేదా కేవలం దవనం తీసుకొని ఆ దవనం ఆకులను గణపతి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్న పనులలో కచ్చితంగా సక్సెస్ వస్తుంది.
అలాగే బాగా పేరు ప్రఖ్యాతులు రావాలనుకునేవారు, కోటీశ్వరులు అవ్వాలని, ఆర్థిక సమస్యలు పోవాలని అనుకునేవారు, కెరీర్‌లో, విద్యలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకునేవారు, ఎలాంటి పనిలో అయినా విజయం సాధించాలని అనుకుంటే.. ఇలా దవనం ఆకులను గణపతి వద్ద ఉంచి పూజించాలి. దీంతో అనుకున్నది నెరవేరుతుంది. ఆయురారోగ్య అష్వైశ్వరాలు కలుగుతాయి. దరిద్రం పోయి కోటీశ్వరులు అవుతారు.