Parrots : మన చుట్టూ ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో పక్షులు కూడా ఒకటి. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే రామ చిలుకలు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి ఆకుపచ్చ రంగులో చూడముచ్చటగా ఉంటాయి. వీటి ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని చిలుకలు మాట్లాడే శక్తిని కూడా కలిగి ఉంటాయి. కానీ అవి మనకు అంతగా ఎదురు పడవు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుకలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అంటే వీటిని ఇంట్లో పెంచుకోమని కాదు.. వీటి ఫొటోలను ఇంట్లో పెట్టుకోవాలని అర్థం. అప్పుడు మనకు మంచి ఫలితాలు కలుగుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుకలు పాజిటివ్ ఎనర్జీకి, తెలివి తేటలకు, నైపుణ్యాలకు ప్రతీకలు. కనుక వీటికి చెందిన చిత్రపటాలను మనం ఇంట్లో పెట్టుకోవాలి. పిల్లలు చదువుకునే గదిలో లేదా హాల్‌లో ఉత్తర దిక్కున ఈ ఫొటోలను పెట్టాలి. దీంతో పిల్లల తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వృద్ధి చెందుతాయి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. అలాగే వారు ఎంచుకున్న రంగంలో సత్తా చాటుతారు. రామ చిలుకల ఫొటోలను వారి గదిలో పెట్టడం వల్ల పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఇక ఇంట్లో హాల్ లో ఉత్తర దిక్కున రామ చిలుకల ఫొటోలను పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని వారు యాక్టివ్‌గా ఉంటారు. వ్యాపారం లేదా ఉద్యోగం చేసేవారు తెలివితేటలను పెంచుకుంటారు. దీంతో వారు తమ రంగంలో రాణిస్తారు. డబ్బు బాగా సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇలా రామచిలుకల ఫొటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం లాభాలను పొందవచ్చు. అయితే ఒక్క చిలుక ఉన్న ఫొటో కాకుండా జంట చిలుకలు ఉన్న ఫొటోలను పెడితే ఇంకా ఎంతో మేలు జరుతుంది. వాస్తు పరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి.