Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రెండు కొత్త ప్లాన్లను ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. రూ.1499, రూ.4199 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందజేస్తోంది.
రూ.1499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 2 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఇక రూ.4199 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే రోజుకు 3 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంట్లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఇక ఈ రెండు ప్లాన్లతోనూ రూ.1499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తారు. అందుకు గాను ఈ ప్లాన్లతో రీచార్జి చేసుకున్న తరువాత వినియోగదారులు మై జియో యాప్‌లోకి వెళ్లి కూపన్‌ను పొందాలి. దాన్ని హాట్ స్టార్ యాప్‌లో ఉపయోగించి ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఇలా ఉచితంగా హాట్ స్టార్ యాప్ మెంబర్‌షిప్ లభిస్తుంది.
ఇక హాట్ స్టార్ యాప్ మెంబర్‌షిప్ సహాయంతో ఒకేసారి నాలుగు డివైస్‌లలో వీడియోలను 4కె క్వాలిటీతో వీక్షించవచ్చు. అంతర్జాతీయ షోస్, మూవీస్ ను వీక్షించవచ్చు. లైవ్‌లో క్రికెట్‌ను కూడా చూడవచ్చు.