Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో నటిస్తోంది. ప్రస్తుతం యశోద సినిమా కోసం ఉత్తర భారతదేశంలో విహరిస్తోంది. అందులో భాగంగానే తన సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా సమంత మరో బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారింది. ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ యాప్ డ్రీమ్ 11కు సమంత ప్రచారం చేయనుంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో డ్రీమ్ 11 ప్రతినిధులు, సమంత కలిసి మాట్లాడారు.

డ్రీమ్11 వల్ల తాను పలు రకాల క్రీడల గురించి తెలుసుకోగలిగానని సమంత ఈ సందర్బంగా తెలియజేసింది. ఏదైనా గొప్ప లక్ష్యం గురించి కల కని దాన్ని సాకారం చేసుకునేందుకు ముందుకు సాగాలనే డ్రీమ్ 11 కాన్సెప్ట్ తనకు ఎంతగానో నచ్చిందని.. అందుకనే డ్రీమ్ 11కు ప్రచారం చేస్తున్నానని సమంత చెప్పింది. కాగా ఈ సీజన్ ఐపీఎల్‌లో డ్రీమ్ 11 సంస్థకు సమంత యాడ్స్ చేస్తుంది. ఆ యాడ్స్ ఐపీఎల్ మ్యాచ్‌లలో ప్రసారం అవుతాయి. ఇలా ఐపీఎల్‌లో సమంత అలరించనుంది. ఇక ఐపీఎల్ ప్రారంభం సందర్భంగా డ్రీమ్ 11 లో ఫాంటసీ క్రికెట్ ఆడితే పలు విభాగాల్లో రుసుముకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 29వ తేదీ వరకు ఉంటుందని డ్రీమ్ 11 ప్రతినిధులు తెలియజేశారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా జట్లు పోడీ పడనున్నాయి. చెన్నై జట్టుకు ధోనీ ఇటీవలే అనూహ్యంగా కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అయితే ధోనీ మాత్రం వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. ఇక గత సీజన్‌లో రన్నరప్ అయిన కోల్‌కతా ఈసారి కప్పు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. అందులో భాగంగానే వేలంలో హేమాహేమీలైన ఆటగాళ్లను కూడా దక్కించుకుంది. ఇక ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు.