Siva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తన టాలెంట్‌తో ఎన్నో షోలు చేశాడు. అదే టాలెంట్‌తో అనేక సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కాగా ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనలకు చెందిన వివరాలను వెల్లడించారు. ఒక ఫ్రెండ్ చేతిలో తాను ఏకంగా రూ.70 లక్షలు నష్టపోయానని తెలిపారు.
అప్పట్లో తాను బ్యాచిలర్‌గా ఉండేవాన్నని.. తాను సినిమాలు, షోస్ చేస్తూ రూ.70 లక్షలు కూడబెట్టానని తెలిపాడు. దాంతో హైదరాబాద్‌లో ఇల్లు, స్థలం కొనాలని చాలా ప్రయత్నించానని, కానీ తన ఫ్రెండ్ ఒకతను అది బాగాలేదు, ఇది బాగాలేదు.. అని తనను మభ్య పెట్టాడని తెలిపారు. ఆ తరువాత తాను అమెరికా వెళ్లాల్సి వచ్చిందని.. ఈ క్రమంలో స్నేహితుడు అని చెప్పి అతని వద్ద రూ.70 లక్షలు పెట్టి వెళ్లానని.. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చాక తనకు ఆ డబ్బు విషయంలో అతను షాకిచ్చాడని తెలిపారు.
అమెరికా నుంచి వచ్చాక ఓ చోట ఇల్లు చూశానని.. కొందామని డబ్బులు ఉన్న బ్యాగ్‌ను తెమ్మంటే.. తన ఫ్రెండ్ చావు కబురు చల్లగా చెప్పినట్లు.. తనకు ఓ సమస్య వస్తే ఆ డబ్బు మొత్తాన్ని వాడుకున్నానని చెప్పాడని.. కొద్ది రోజుల్లో ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తానని అన్నాడని.. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బు ఇవ్వలేదని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలా తన కష్టం మొత్తం వృథా అయిందని అన్నారు. అయితే అప్పట్లో అదే డబ్బును తాను వాడుకుని ఉంటే ఇప్పటికి మణికొండలో తనకు రెండు మూడు ప్లాట్స్ ఉండేవని తెలిపారు.