Sreeja : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్‌ల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ రోజుకో వార్త ప్రచారం అవుతోంది. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. సమంత గతంలో తన పేరు నుంచి అక్కినేని అన్న పేరును తొలగించింది. తరువాత విడాకులు తీసుకుంది. ఇక ఇప్పుడు శ్రీజ కూడా అలాగే కల్యాణ్ అన్న పేరును తొలగించి శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

అయితే శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు ఈ వార్తలను ఖండించలేదు. కానీ ఎప్పుడూ జంటగా కనిపించే వీరు మాత్రం విడి విడిగా కనిపిస్తున్నారు. భర్తతో ఎక్కువ సమయం గడిపే శ్రీజ.. ఇప్పుడు పిల్లలతో కనిపిస్తోంది. ఈ మధ్యే తన సోదరుడు రామ్ చరణ్ తో కలిసి ముంబైలో కొన్ని రోజులు గడిపింది. దీంతో ఆమె కల్యాణ్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు మరోసారి చక్కర్లు కొట్టాయి. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీజ ప్రస్తుతం ఏ పోస్టు పెట్టినా అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
స్వతహాగా వివిధ రకాల వంటలు అంటే ఇష్టం ఉండే శ్రీజ.. కోడిగుడ్డుతో ఏదో వంటకం చేస్తూ దాన్ని ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టింది. కోడిగుడ్డు అంటే ఇష్టమని.. దానికి బానిసను అయ్యానని చెప్పింది. అంటే ఆమెకు కోడిగుడ్లు అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే శ్రీజ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఇక ఈ మధ్య కల్యాణ్ దేవ్ కూడా ఒంటరిగానే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుండడం విశేషం.