వినోదం

Pushpa 2 : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేట‌ర్‌కి వెళ్లిన బ‌న్నీ.. తొక్కిస‌లాట‌లో మ‌హిళ మృతి, బాలుడి ప‌రిస్థితి విష‌మం

Pushpa 2 : కొన్ని రోజులుగా బ‌న్నీ అభిమానులు పుష్ప‌2 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ రాగా, ఈ మూవీ గ‌త రాత్రి ప్రీమియ‌ర్ షోల‌తో సంద‌డి చేసింది. ప‌లు చోట్లు మూవీ బెనిఫిట్ షో ప్ర‌ద‌ర్శించ‌గా, సినిమా చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. సినిమాకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ఎగబడ్డారు. వేల సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో థియేటర్‌ కిక్కిరిసిపోయింది. థియేటర్‌ లోపలికి ఎగబడడంతో పరిస్థితి చేయి దాటింది. తీవ్ర తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో కొందరు అస్వస్థతకు గురయ్యారు.

దిల్‌షుఖ్ న‌గ‌ర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎంకి వ‌చ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు.. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు.. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.కాగా ఈ సంఘటనతో అల్లు అర్జున్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారని అల్లు అర్జున ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఇక పుష్ప‌2 చిత్ర బృందం ఇప్ప‌టికే న్యాయస్థానాల్లో ప‌లు చిక్కులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ ఘటనతో మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పుష్ప‌2 విషయానికి వ‌స్తే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పుష్ప మొదటి దానికన్నా సీక్వెల్‌ మించి ఉందని చర్చ జరుగుతోంది. సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ ఎంట్రీ సీన్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ అద‌ర‌గొట్టాడ‌ని చెబుతున్నారు.

 

Sam

Recent Posts