Thaman : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ థ్రిల్లర్ లవ్ స్టోరీ సినిమాలో వైవిధ్య భరితమైన పాత్రలో నటించాడు. దీంతో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. సినిమా చాలా స్లో గా ఉందని అంటున్నారు.
రాధే శ్యామ్ సినిమా విజువల్స్ పరంగా బాగానే ఉంది. కానీ లవ్ స్టోరీ అనే సరికి కాస్త నెమ్మదిగా ఉండడం సహజమే. అయితే గత ప్రభాస్ చిత్రాలతో పోలిస్తే ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కనుక యాక్షన్ సన్నివేశాలను కోరుకుంటారు. కానీ ఈ చిత్రంలో అవి తక్కువే అని చెప్పాలి. అందువల్ల కొందరు ప్రేక్షకులు హర్ట్ అయి సినిమా చాలా నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. ఇక ఆ కామెంట్లపై సంగీత దర్శకుడు థమన్ పంచ్‌లు వేశారు. తనదైన శైలిలో మీమ్స్‌ను చేసి వాటిని షేర్ చేశారు. ఈ క్రమంలోనే థమన్ ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.
#BlockBusterRadheShyam ????????????????????????
Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii ????????????????
Adhirindhiiiii memmeee !! ???????????????????????? pic.twitter.com/SGW10l5w5h
— thaman S (@MusicThaman) March 11, 2022
సినిమా బాగా స్లో గా ఉందన్న వారికి థమన్ మీమ్ వేశారు. సినిమా ఎలా ఉందని అడిగాం.. అడిగింది బాగా ఉందా.. లేదా.. అని.. లవ్ స్టోరీ నెమ్మదిగా ఉండకుండా.. ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్‌లా.. సెకండాఫ్‌లో సెకండ్ సెటప్‌లా పెట్టాలా.. ఏంటి.. అనే మీమ్‌ను థమన్ చేశారు. దీంతో ఆయన మీమ్ వైరల్‌గా మారింది.
అయితే వాస్తవానికి సినిమా బాగానే ఉందని అంటున్నారు.. కానీ నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. ఇదే సినిమాకు పెద్ద మైనస్ అని అంటున్నారు.