మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి వారు ఏ రాశివారో చూద్దాము.
మేషం..
రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి.
వృషభం..
వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.
సింహం..
ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము.
మకరం..
రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది.