సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) కన్ను మూశారు. శుక్రవారం రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె చికిత్స తీసుకుంటూ శనివారం కన్నుమూశారు. కాగా రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మరణంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.