ఆధ్యాత్మికం

Garuda Puranam : గ‌రుడ పురాణం ప్ర‌కారం మ‌న‌కి మంచి రోజులు రాబోతున్నాయ‌ని తెలిపే 10 సంకేతాలు..!

Garuda Puranam : మనకి అంతా మంచే జరగాలని, ఎలాంటి బాధ కూడా లేకుండా హాయిగా, సంతోషంగా ఉండాలని ఉంటుంది. అయితే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది..? ఎటువంటి సంకేతాలు మనకి కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం, మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి జీవితంలో డబ్బుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువ కూడా లేదు. డబ్బులు లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి. లక్ష్మీ దేవి ధనానికి సంకేతం. లక్ష్మీదేవి కరుణిస్తే, మన దశ తిరిగిపోతుంది. పురాణాల ప్రకారం ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా అడిగాడట. తండ్రీ.. మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని.. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారట.

these signs indicate we are getting luck and money

మన ఇంటికి నిత్యం ఆవు వస్తే, కచ్చితంగా లక్ష్మీదేవి కరుణించినట్లే అని అన్నారట. ఆవు వస్తే ఆవు తినడానికి ఏదో ఒకటి పెట్టాలి. ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుని పిల్లల్ని పెడితే, లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్టు దానికి అర్థమట. మూడు బల్లులు కలిపి ఒకే చోట కనిపిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెళ‌కువ వచ్చిన వెంటనే తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందట.

బల్లి, నక్షత్రం, గులాబీ, శంఖం, ఏనుగు, ముంగిస కలలోకి వచ్చినా కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని దానికి సంకేతం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనపడితే, ధన లాభం కలగబోతోందని దానికి సంకేతం. ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం. ఒకవేళ కనుక పిల్లలు ప్రతిదానికి ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. కష్టాలు కలుగుతాయి. ఇలా ఈ విధంగా మనం అదృష్టం కలగబోతుందని, ధనం మన ఇంటికి రాబోతోందని తెలుసుకోవచ్చు.

Admin

Recent Posts