Tomato Pasta : ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు అందరూ బిజీగా కాలం గడుపుతున్నారు. దీంతో తినేందుకు కూడా సరైన సమయం లభించడం లేదు. ఇక ఉదయం ఇంట్లో వంట చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెండూ చేయాలంటే మహిళలకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే సమయం కూడా సరిపోదు. అయితే ఇలా వంట చేసేందుకు సమయం లేకపోతే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ లోకి కూడా ఒకే వంటకాన్ని చేయవచ్చు. అదే టమాటా పాస్తా. దీన్ని 10 నిమిషాల్లో చేయవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం ఎప్పుడైనా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం చాలా ఈజీ. టమాటా పాస్తాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా పాస్తా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాస్తా – ఒకటిన్నర కప్పు, నూనె – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, టమాటా పాస్తా సాస్ – 6 టేబుల్ స్పూన్లు, చీజ్ – తగినంత.

టమాటా పాస్తాను తయారు చేసే విధానం..
ఒక పాత్రను తీసుకుని అందులో సుమారుగా 6 కప్పుల నీళ్లను పోయాలి. మధ్యస్థ మంటపై ఆ నీళ్లను మరిగించాలి. అందులోనే పాస్తాను వేయాలి. అలాగే ఒక టీస్పూన్ నూనె, తగినంత ఉప్పును కూడా వేయాలి. బాగా కలుపుతూ పాస్తాను బాగా ఉడికించాలి. పాస్తా కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇందుకు గాను సుమారుగా 10 నిమిషాల వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. దీంతో పాస్తా అతుక్కుపోకుండా ఉంటుంది. ఇక పాస్తా ఉడికిన తరువాత అందులో ఉండే నీళ్లను పారబోయాలి. ఇప్పుడు ఉడికిన పాస్తాను పక్కన పెట్టాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అనంతరం అందులో టమాటా పాస్తా సాస్‌ను వేయాలి. దీన్ని కలుపుతూ వేడి చేయాలి.
వేడయ్యాక అందులో అంతకు ముందు ఉడికి సిద్ధంగా ఉన్న పాస్తాను వేసి బాగా కలపాలి. దీన్ని 2-3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆపై దాని మీద చీజ్‌ను తురుముకుని చల్లాలి. దీంతో ఎంతో రుచికరమైన టమాటా పాస్తా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్‌లో దీన్ని తినవచ్చు. వంట చేసేందుకు సమయం లేకపోతే దీన్ని ట్రై చేయవచ్చు. చాలా త్వరగా అవుతుంది.