Uppu Jadi : ప్రస్తుత కాలంలో డబ్బు మీద ఆశ లేని వారు చాలా తక్కువ. అందరూ ధనం రావాలి.. ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ధనాభివృద్ధి కోసం రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడుతుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు. అనేక పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరి దగ్గర డబ్బు నిల్వదు. వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చై పోతూ ఉంటుంది. అవసరానికి డబ్బులు అందవు. అప్పు చేయాల్సి వస్తుంది. ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చవుతుంది. అనవసరమైనా వస్తువులు కొనుగోలు చేసి డబ్బు వృధా చేస్తూ ఉంటారు. ఇలా డబ్బు ఖర్చైపోకుండా డబ్బు నిలబడాలంటే ఒక చిన్న చిట్కాను పాటించాలి.
ఈ చిట్కాను పాటించడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మన దగ్గర డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీని కోసం మనం ముందుగా ఒక మట్టి జాడీని తీసుకోవాలి. శుక్రవారం నాడు అమ్మ వారికి పూజ చేసి నైవేధ్యం సమర్పించిన తరువాత ఒక రాగి ప్లేట్ ను లేదా ఇత్తడి ప్లేట్ ను తీసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లో నూతన పసుపు వస్త్రాన్ని ఉంచాలి. తరువాత ఈ వస్త్రంపై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మును, వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి. తరువాత ఈ మూటను మట్టి జాడిలో అడుగు భాగాన ఉంచి దానిపై రాళ్ల ఉప్పును పోయాలి.
ఈ విధంగా మట్టి జాడిలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో సాధారణ ఉప్పుకు బదులుగా దీనిని ఉపయోగించాలి. ఈ విధంగా మట్టి జాడిలో వేసిన రాళ్ల ఉప్పును వాడిన వారం నుండి రెండు వారాల వ్యవధిలోనే మనం మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే పసుపు వస్త్రం అందుబాటులో లేని వారు తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో నానబెట్టి తరువాత ఎండబెట్టి మూట కట్టుకోవడానికి ఉపయోగించాలి. అలాగే వెండి, బంగారు నాణాలు, ఉంగరాలు అందుబాటులో లేని వారు కనీసం ఒక చిన్న ముక్క బంగారానైనా వేయాలి. ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ చిట్కాను పాటించడం వల్ల అధ్భుతమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.