Vastu Tips : వాస్తు శాస్రం.. ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి. చైనా, ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు. వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత, చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం, ఆరోగ్యం, అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదట. ఒక వేళ ఈ వస్తువులను పెట్టుకుంటే అంతా నాశనమే జరుగుతుందని.. అన్నింటా నష్టాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో పెట్టుకోవద్దు. ఉంటే వెంటనే తీసేయండి. ఇక ఆ వస్తువులు ఏమిటంటే..
యుద్దాలను ప్రతిబింబించే ఏ ఫోటోలు, పెయింటింగ్స్ ఇంట్లో ఉంచకూడదు. ఇలా ఉంటే మన ఇంట్లో ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగిపోతుంటాయి. బంధువులతోనూ గొడవలు జరుగుతాయి. కనుక అలాంటి ఫొటోలు, పెయింటింగ్‌లను ఇంట్లో పెట్టుకోరాదు. అలాగే ప్రతిఫలాన్ని సూచించని చిత్రాలు.. పండ్లు, పూలు పుయ్యని చెట్లు.. నీళ్లు లేని నదిలో పడవ, నగ్న చిత్రాలు, ఇంద్రజాల ప్రదర్శన చిత్రాలు.. ఇలాంటి చిత్రాలుంటే.. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా దురదృష్ట వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తుంది. కనుక ఇలాంటి ఫొటోలు, పెయింటింగ్‌లను కూడా ఇంట్లో నుంచి తీసేయాలి. లేదంటే నష్టాలు సంభవిస్తాయి.
లవ్ కు సింబాలిక్ గా చెప్పుకునే తాజ్ మహల్ వాస్తవానికి ముంతాజ్ సమాధి. సమాధుల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు రీత్యా అత్యంత ప్రమాదకరం. కనుక తాజ్ మహల్ ఫొటోలే కాదు.. బొమ్మలు ఉన్నా సరే వెంటనే తీసేయండి. ఒంటరిగా ఉన్న జంతువుల ఫోటోలు కానీ, క్రూర ప్రవృత్తి గల జంతువుల ఫోటోలు కానీ బెడ్ రూమ్ లో ఉండకూడదు. ఇలా ఉంటే భార్యభర్తల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా ఇంట్లో ఉన్న వారికి పట్టరాని కోపం వస్తుంటుంది. కనుక వాటిని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు.
విరిగిపోయిన బొమ్మలు, పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. దీని వల్ల సంపాదనలో తృప్తి ఉండదు. ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. జలపాతపు పెయింటింగ్స్ మన ఇంట్లో ఉంటే.. మన సంపద మన చెంత ఎక్కువ కాలం నిల్వ ఉండద. ఇవి మన స్థానాన్ని ఉన్నతం నుండి అథమం వైపుగా క్రమంగా దిగజార్చుతాయి. కనుక జలపాతాలకు చెందిన ఫొటోలు లేదా పెయింటింగ్‌లను కూడా ఇంట్లో ఉంచరాదు. అలాగే తాండవం చేస్తున్న నటరాజ విగ్రహం ఇంట్లో ఉంటే వినాశనానికి కారణం అవుతుందట. కనుక ఆ విగ్రహాన్ని కూడా తీసేయాలి.
ముళ్ల మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. చేతిలో పైసా నిలువకపోగా అప్పుల పాలు అవుతారు. గొడవలు అవుతాయి. కనుక ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచరాదు. ఇక ఇంట్లో గోడలపై, ముఖ్యంగా బెడ్ రూమ్ లో ఏడుస్తున్న బాలుడి ఫోటో ఉండకూడదు. ఇలా ఉంటే పుట్టబోయే సంతానం అభద్రతాభావం కలిగిన వారై పుడతారట. కనుక అలాంటి ఫొటోలను తీసేయాలి. కురుక్షేత్ర యుద్దానికి సంబంధించిన ఫోటోలను మన ఇంట్లో ఉంచకూడదు. వీటి వల్ల బంధువులతో వైరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఇలాంటి ఫొటోలు లేదా పెయింటింగ్‌లను కూడా ఇంట్లో పెట్టరాదు. ఉంటే వెంటనే తీసేయాలి. లేదంటే వాస్తు దోషం ఏర్పడి అన్నీ సమస్యలే వస్తాయి. కనుక ఈ జాగ్రత్తలను తీసుకుంటే వాస్తు దోషాలు ఉండవు. ఫలితంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.