Vijayakanth : కెప్టెన్ ప్రభాకర్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయిన విజయ్‌కాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో రజనీకాంత్ సినిమాలను తెలుగులో విడుదల చేస్తే ఎంతగా చూస్తారో.. ఒకప్పుడు విజయ్‌కాంత్ సినిమాలను డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తే అంతగా చూసేవారు. అంతగా ఈయన పాపులర్ అయ్యారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈయనకు ఈమధ్య అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. దీంతో బయటకు రావడం లేదు. విదేశాలకు వెళ్తూ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ కాంత్‌కు చెందిన ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో ఆయన పూర్తిగా మారిపోయి గుర్తు పట్టరాని విధంగా కనిపించారు. దీంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.
2014 ఎన్నికల్లో ఈయన డీఎండీకే పార్టీ ద్వారా పోటీ చేశారు. కానీ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు తరచూ తిరుగుతున్నారు. అక్కడి హాస్పిటల్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తన భార్య ప్రేమలతతో కనిపించారు. దీంతో ఆయన వీడియో వైరల్ అయింది.
Latest Picture Of Captain Vijayakanth! ❤️@iVijayakant#Captain #Vijayakanth pic.twitter.com/m9YCEAnWxS
— Behindwoods (@behindwoods) February 28, 2022
ఇక తాజాగా విజయ్‌కాంత్ పూర్తిగా అనారోగ్యం బారిన పడి గుర్తు పట్టరాని విధంగా మారిపోయారు. దీంతో ఆయనను ఇప్పుడు చూసిన వారందరూ ఆయనకు ఏమైందా.. అని ఆరా తీస్తున్నారు. విజయ్ కాంత్ వృందాచలం, రిషివందియం అనే రెండు ప్రాంతాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. కాగా ఈయన ఆరోగ్యం కుదుట పడితే త్వరలో విజయ్ ఆంథోని సినిమాలో నటిస్తారని తెలుస్తోంది.