technology

కీబోర్డ్‌పై ABCDలు వరుస‌గా ఉండ‌వు.. QWERTYగా ఎందుకు ఉంటాయి..?

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌టి కూడా కంప్యూట‌ర్‌తో అనుసంధాన‌మైపోయింది. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు ఏదో సంద‌ర్భంలో కంప్యూట‌ర్‌ని వాడుతూనే ఉన్నారు. అయితే ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా జేబులోమొబైల్ ఫోన్ కావచ్చు. ఏదైనా కీబోర్డ్‌ని మీరు గ‌మ‌నిస్తే దానిపై A కి బదులుగా B తర్వాత S అని ఉండటం మీరు చూస్తారు. B చాలా దూరంలో ఉంది. V పక్కన ఉంది. అయితే కీబోర్డుపై వరుసగా A, B, C, D ఎందుకు ఉండవో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత దూరంగా రాయాల్సిన అవసరం ఏముంది? అలా ABCDలు వరుస సంఖ్యలో కాకుండా గందరగోళంగా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y, U, I, O, P అనే లేటర్స్‌ ఉంటాయి. వాటిని కలిపేసి పలుకుతారు.

ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ అనే వ్యక్తి రూపకల్పన చేశారట. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట. ఇంగ్లిష్‌ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q, Z W, X, వంటి లెటర్స్‌ వాడకం తక్కువగా ఉంటుంది. ఈ అక్షరాలు పెద్దగా వాడము. కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటాము. ఇక అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటాము. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డును ‘Qwerty’ నమూనాలో చేశాడట.

why keyboard letters are in qwerty format

టైప్‌రైటర్‌ను కనిపెట్టిన క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ ఏబీసీడీ ఫార్మాట్‌లో తొలి కీబోర్డును తయారు చేశారు. ఇక్కడ ABCD వరుసగా వ్రాయబడుతుంది. అనేక విఫలమైన ప్రయోగాల తర్వాత 1870లలో QWERTY ఫార్మాట్ దశాబ్దంలో ఎంపిక చేయబడింది. ఈ అమరికన్ టైప్‌రైటర్ సూదులు ఇరుక్కుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీబోర్డ్‌లో అక్షరాలను క్రమబద్ధీకరించడానికి డ్వోరాక్ మోడల్ కూడా ప్రవేశపెట్టబడింది. ఈ మోడల్ కూడా చాలా సులభం కానప్పటికీ, ఇది ఫలితంగా ప్రజాదరణ పొందలేదు. తర్వాత కీబోర్డ్ కోసం QWERTY ఫార్మాట్ మాత్రమే ఎంపిక చేయబడింది. మొత్తానికి ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను చేతివేళ్లకు అందుబాటులో ఉండే ఈ కీబోర్డ్‌ని త‌యారు చేశారు.

Sam

Recent Posts