Rose Syrup : మనకు బయట షర్బత్ వంటి వివిధ రకాల పానీయాలు లభ్యమవుతూ ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. బయట లభించే ఈ పానీయాలలో వాటిని చేసే వారు రోజ్ సిరప్ ను కలుపుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల తీపి పదార్థాలలో కూడా ఈ రోజ్ సిరప్ ను వాడుతూ ఉంటారు. ఈ రోజ్ సిరప్ ను కలపడం వల్ల ఈ పానీయాల రుచి మరింత పెరుగుతుంది. ఈ రోజ్ సిరప్ మనకు బయట మార్కెట్ లో లభ్యమవుతుంది. బయట కొనుగోలు చేసే లేకుండా దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ ను తయారు చేయడం చాలా సులభం. బయట లభించే విధంగా ఉండేలా రోజ్ సిరప్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ సిరప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండిన గులాబి రేకులు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, పంచదార – ఒక కప్పు, రోస్ కలర్ – 2 చుక్కలు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
రోజ్ సిరప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అర కప్పు నీటిని పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండిన గులాబి రేకులను వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె మీద మూతను ఉంచి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్న గులాబి నీటితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి మరిగించాలి. ఈ రోజ్ సిరప్ ఎటువంటి పాకం రావల్సిన అవసరం లేదు. పంచదార మిశ్రమం కొద్దిగా బంకగా అచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత దీనిని ఒక గాజ్ సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చక్కటి రుచిని కలిగి ఉండే రోజ్ సిరప్ తయారవుతుంది.
ఈ సిరప్ తయారీలో వాడే ఎండు గులాబి రేకులను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దేశవాళి గులాబీలను తీసుకుని వాటిని రేకులను రెండు నుండి మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. గులాబి రేకులు పూర్తిగా ఎండిన తరువాత గాలి తగలకుండా సీసాలో ఉంచి నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇంట్లో షర్బత్ , కూల్ డ్రింక్స్ వంటి వాటిని తయారు చేసుకున్నప్పుడు డిసర్ట్ వంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ రోజ్ సిరప్ ను వాడడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది.