Wake Up : ఉదయం నిద్రలేవగానే చాలా మంది ఏదో ఒక వస్తువును తదేకంగా చూస్తూ ఉంటారు. దేవుడి ఫోటోను లేదా ప్రతిమను, అర చేతిని, వేళ్లకు ఉన్న ఉంగరాలను, ఇతర ముఖాలను లేదా వారి ముఖాలను వారే చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం దరిద్రం అని శాస్త్రం చెబుతోంది. కొందరు ఉదయం లేవగానే తల దువ్వుకుని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కొందరు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ, టీ లను తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట. అలాగే చాలా మంది ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడమే మనకు చాలా మంచిదట.
కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలి అని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనం సూర్యుడి ఆగ్రహానికి గురవుతామని, డబ్బు కూడా ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం లేవగానే చూడాల్సినవి ఏమిటి.. చూడకూడనివి ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఏదైనా చెడు జరిగినప్పుడు ఈ రోజు పొద్దున ఎవరి ముఖం చూశామో ఏమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా వీటిని నమ్మే వారు కూడా చాలా మంది ఉంటారు. పురుషులు ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యను అస్సలు చూడకూడదు. అదే విధంగా బొట్టు లేని ఆడపిల్ల ముఖం కూడా ఉదయాన్నే చూడకూడదు.
అలాగే చాలా మంది స్త్రీలు ఉదయం లేవగానే నేరుగా వంటగదిలోకి వెళ్లి పనులు ప్రారంభిస్తారు. కానీ స్త్రీలు ఉదయం లేవగానే శుభ్రం చేయని పాత్రలను చూడకూడదు. అదే విధంగా చాలా మంది ఇండ్లల్లో జంతువుల బొమ్మలు, ఫోటోలు ఉంటాయి. ఉదయం లేవగానే జంతువుల బొమ్మలను చూడడం లేదా జంతువులను చూడడం అస్సలు మంచిది కాదు. ఉదయం నిద్రలేవగానే చేయాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన వెటనే భూదేవతకు నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది. కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూ దేవికి నమస్కరించి కాళ్లను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
అలాగే నిద్రలేచిన వెంటనే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది. దేవతలు కొలువు ఉండే గోవును, తులసి మొక్కను నిద్రలేవగానే చూడడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే పర్వతాలను, సముద్రాన్ని, గుడి గోపురాన్ని చూసినా కూడా మనకు శుభమే కలుగుతుంది. వీటితోపాటు బంగారాన్ని, దూడతో ఉన్న ఆవును, ఎర్ర చందనాన్ని చూసినా కూడా మనకు మంచే జరుగుతుంది. ఇక పురుషులు వారి భార్యను చూసినా, అగ్నిని చూసినా, యజ్ఞం చేసే వారిని చూసినా కూడా మంచే జరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే మన అర చేతిని మనం చూసుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఉదయం లేవగానే అర చేతిని చూసుకుని లక్ష్మీ దేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా లక్ష్మీ దేవి మనతోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.