పోష‌ణ‌

రేగి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

ఎక్కువగా రేగి పండ్లు ఈ కాలంలో దొరుకుతాయి. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవి అందిస్తాయి. చైనీయులు కాలేయం శక్తివంతంగా పని చేయడానికి రేగి పండ్ల తో తయారు చేసిన టానిక్ ను తాగుతుంటారు. 300 రకాల రోగాలనైనా తగ్గించగల ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. రేగి పండ్లలో విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడొచ్చు. బరువు పెరగాలనుకునే వారికి ఇవి సహాయ పడతాయి. అలానే ఇవి కండరాల నొప్పులను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వగల రేగు పండ్లను బలహీనంగా ఉన్న వారు తినడం చాలా మంచిది.

మల బద్ధకం, అజీర్తిని తగ్గించడానికి కూడా ఇవి సహాయ పడతాయి. ఆయుర్వేద మందుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. రేగి పండ్ల లో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రేగి తీసుకోవడం మంచిది. విరేచనాల తో బాధ పడుతున్న వారు రేగి చెట్టు బెరడును తీసి కషాయంలా చేసి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కఫము, పైత్యము, వాతం లాంటి సమస్యలు బాధిస్తుంటే రేగి పండ్లు తినాల్సిందే.

many wonderful health benefits of regi pandu

రేగి పండ్లు కాలేయానికి సంబందించిన సమస్యలను నయం చేసి మరింత మెరుగ్గా పని చేసేలా చేయగలవని జపనీయులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడించారు. తరచూ జ్వరం, జలుబు తో బాధపడేవారు ఈ సీజన్లో విరివిగా లభించే రేగి పండ్లను కచ్చితంగా తినాలి. చర్మం పై బొబ్బలు, కురుపులు వచ్చి బాధిస్తున్నపుడు రేగు పండు ఆకులను నూరి చర్మం పై రాసుకోవడం వలన వెంటనే నయమవుతాయి.

Admin

Recent Posts