హెల్త్ టిప్స్

రోజూ మేక‌ప్ వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

బయటకి వెళ్ళిన ప్రతీసారీ మేకప్ వేసుకోవడం వేరు. రోజూ మేకప్ వేసుకోవడం వేరు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలైన ప్రత్యేకమైన రోజుల్లో మేకప్ వేసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదు కానీ, ప్రతీ రోజూ మేకప్ వేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. చర్మ సమస్యలు రావడానికి రోజూ మేకప్ వేసుకోవడం కూడా ఒక కారణం. మనకు సరిపడని చర్మ సౌందర్య సాధనాలని వాడడం వల్ల తలనొప్పి వస్తుంది. మేకప్ సాధనాల్లో ఉండే రసాయనాలు, చర్మానికి చికాకు కలిగించడంతో పాటు తలనొప్పికి కారణమవుతాయి. అందుకే మీ చర్మానికి ఏది సూటవుతుందో తెలుసుకోవాలి.

ప్రతీ రోజూ మేకప్ వేసుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల మొటిమలు తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు. చర్మం పొడిబారుతుంది. కంటికింద మేకప్ వేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనురెప్పలు, కనుబొమ్మలకి మేకప్ వేసే సాధనాల్లో ఉండే రసాయనాలు కంటి సమస్యలకి దారి తీయవచ్చు. అందుకే కంటి చుట్టూ మేకప్ వేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని మేకప్ సాధనాలు అందరికీ వర్తించవు. మీ చర్మం రకాన్ని బట్టి మేకప్ సాధనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ చర్మం సున్నితమైనది అయితే రోజూ మేకప్ వేసుకోవడం మంచిది కాదు. దానివల్ల మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.

if you are doing make up daily then know this

చర్మంపై పగుళ్ళు ఏర్పడడానికి కారణాలైన చాలా వాటిల్లో రోజూ మేకప్ వేసుకోవడం కూడా ఒకటి. అలాగే మీ మేకప్ సాధనాలని ఇతరులతో పంచుకునే అలవాటు మానెయ్యండి. మేకప్ సాధనాల్లో ఉండే బ్యాక్టీరియా మీ చర్మానికి హాని చేస్తుంది.

Admin

Recent Posts