ఫోలిక్ యాసిడ్.. దీన్నే ఫోలేట్ అంటారు. విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. మన శరీరానికి కావల్సిన విటమిన్లలో ఇది కూడా ఒకటి. దీంతో అనేక జీవక్రియలు నిర్వహించబడతాయి. కొత్త కణాలు తయారవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల రోజూ ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఈ విటమిన్ లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.
ఫోలిక్ యాసిడ్ నీటిలో కరుగుతుంది. అందువల్ల శరీరానికి ఇది సులభంగానే లభిస్తుంది. కాకపోతే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది డీఎన్ఏ, ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే పలు లక్షణాలు కనిపిస్తాయి.
మన శరీరానికి రోజూ ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తీసుకుంటే మలబద్దకం, వికారం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఫోలిక్ యాసిడ్ వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే అనేక సమస్యలు వస్తాయి.
ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఎల్లప్పుడూ అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎల్లప్పుడూ కోపంగా ఉంటారు. నీరసించి పోయినట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. రక్తహీనత సమస్య వస్తుంది.
గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీలతోపాటు వారి శిశువులకు ఇది ఎంతగానో అవసరం. ఫోలిక్ యాసిడ్ వల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. గర్భిణీలు రోజుకు 400 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి.
బ్రొకొలి, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, మొలకలు, రాజ్మా, బీట్ రూట్, అవకాడో, చిలగడ దుంపలు, నారింజ పండ్లు, గుడ్లు, బాదంపప్పు, కందిపప్పు, క్యారెట్లు వంటి ఆహారాల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయా ఆహారాలను రోజూ తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365