Vitamin B12 : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ బి 12 కూడా ఒకటి. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంలో విటమిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడం, నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, ఎర్ర రక్తకణాల తయారీలో ముఖ్య పాత్ర పోషించడం వంటి వివిధ రకాల విధులను నిర్వర్తిస్తుంది. ఇతర పోషకాల వలె మన శరీరానికి విటమిన్ బి 12 చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ బి 12 లోపించడం వల్ల నీరసం, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రక్తహీనత, తలనొప్పి, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి వాటితో పాటు గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అలాగే కాళ్లు, చేతుల్లో మంటలు, సూదులతో గుచ్చినట్టు ఉండడం వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి విటమిన్ బి 12 సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. అలాగే ఈ విటమిన్ ఎక్కువ మోతాదులో ఉండే మాంసాహారాన్ని తరచూ తీసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మనం విటమిన్ బి12 లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అలాగే సోయాబీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం విటమిన్ బి 12 లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది. అలాగే బ్రకోలీని తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి విటమిన్ బి 12 లభిస్తుంది. అలాగే శరీరంలో విటమిన్ బి 12 స్థాయిలను పెంచే ఆహారాల్లో పాలు, పెరుగు ఒకటి.
పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావల్సిన విటమిన్ బి 12 లభిస్తుంది. విటమిన్ బి 12 శరీరంలో లోపించడం వల్ల శారీరకపరమైన సమస్యలతో పాటు అనేక రకాల మానసిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాంసాహారాన్ని తీసుకోలేని వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది. నేటి తరుణంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కనుక లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది. దీంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.