Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌ విట‌మిన్లు

విటమిన్‌ బి12 లోపం ఉంటే జాగ్రత్త పడాల్సిందే.. లక్షణాలను ఇలా తెలుసుకోండి..!

Admin by Admin
March 24, 2021
in విట‌మిన్లు
Share on FacebookShare on Twitter

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్‌ బి12 కూడా ఒకటి. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి అవసరం. నాడీ మండల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా ఈ విటమిన్‌ అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మందిలో విటమిన్‌ బి12 లోపం సమస్య ఏర్పడుతోంది. విటమిన్‌ బి12 లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరానికి ముప్పును కలిగిస్తుంది. దీని వల్ల నీరసం, అలసట, మలబద్దకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

vitamin b12 uses in telugu

సాధారణంగా మాంసాహారం తినే వారికన్నా శాకాహారం తినేవారిలోనే ఎక్కువగా విటమిన్‌ బి12 లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే మాంసంలో విటమిన్‌ బి12 ఉంటుంది. కనుక మాంసాహారం తినేవారిలో ఈ లోపం రాదు. శాకాహారుల్లోనే విటమిన్‌ బి12 లోపం వస్తుంది. అలాగే మద్యం విపరీతంగా సేవించే వారిలో, డయాబెటిస్, అసిడిటీ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, దీర్ఘకాలికంగా మెడిసిన్లను వాడేవారిలోనూ విటమిన్‌ బి12 లోపం కనిపిస్తుంది.

విటమిన్‌ బి12 లోపం వల్ల నీరసం, అలసట, మలబద్దకం సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీని వల్ల జీర్ణాశయ, మూత్రాశయ సమస్యలు వస్తాయి. కనుక ఈ లక్షణాలు, సమస్యలు ఉన్నవారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకుని ఆ మేర చికిత్స తీసుకోవాలి. విటమిన్‌ బి12 ట్యాబ్లెట్లను డాక్టర్‌ సూచన మేరకు నిత్యం వాడాలి. ఇక మటన్‌, చికెన్‌, చేపలు తదితర ఆహారాల్లో విటమిన్‌ బి12 లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా ఈ విటమిన్‌ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇక శాకాహారులు పాలు, బాదంపప్పు, చీజ్‌ వంటి పదార్థాలను తినడం ద్వారా విటమిన్‌ బి12 పెరుగుతుంది. వీలైనంత వరకు మద్యం తాగడం మానేయాలి. పొగ అస్సలు తాగకూడదు. ఈ సూచనలు పాటించడం వల్ల విటమిన్‌ బి12 లోపం రాకుండా చూసుకోవచ్చు.

Tags: vitamin b12
Previous Post

ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు..!

Next Post

కాకరకాయ మంచిదే.. కానీ వీరు దాన్ని అస్సలు తినరాదు.. ఎందుకంటే..?

Related Posts

వార్త‌లు

Vitamin B3 : మీ శ‌రీరంలో ఈ విట‌మిన్ లోపం ఉందా.. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

August 31, 2024
వార్త‌లు

Home Remedies For Vitamin B12 : మీ శ‌రీరంలో విట‌మిన్ బి12ను ఇలా పెంచుకోండి.. ఈ ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

April 3, 2024
వార్త‌లు

Vitamin D In Rainy Season : వ‌ర్షాకాలంలో సూర్య‌ర‌శ్మి రాదు.. విట‌మిన్ డి ఎలా పొందాలి..?

July 24, 2023
వార్త‌లు

Spinach For Vitamin B12 : ఈ కూర‌లో విట‌మిన్ బి12 ట‌న్నులు ట‌న్నులు ఉంటుంది.. వారంలో రెండు సార్లు తిన్నా చాలు..!

June 5, 2023
వార్త‌లు

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

May 27, 2023
వార్త‌లు

Vitamin D Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఆ విట‌మిన్ లోపం కావ‌చ్చు..!

May 23, 2023

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.